- రోలుగుంట మండలం వడ్డిప గ్రామంలో ఆస్తి వివాదంతో వివాహిత హత్యకు గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వడ్డిప్ప గ్రామానికి చెందిన అల్లు లక్ష్మణ్ కు నక్కపల్లి మండలానికి చెందిన అపర్ణతో 10 ఏళ్ల క్రితం వివాహం అయింది. వివాహ సమయంలో అపర్ణ తల్లిదండ్రులు నక్కపల్లిలో కొంత భూమిని కట్నంగా ఇచ్చారు. ఇటీవల కాలంలో దాన్ని అమ్మకం చేయాలంటూ లక్ష్మణ్, అపర్ణపై ఒత్తిడి చేస్తున్నాడు. పిల్లల భవిష్యత్తు కోసం దీనిని ఎంతకు అమ్మేది లేదంటూ అపర్ణ తేల్చి చెబుతోంది. దీనిపై గురువారం రాత్రి మరల వివాదం రేగింది. ఈ విషయంపై ఎదురు సమాధానం చెప్పిన అపర్ణను, అప్పటికే మద్యం తాగి ఉన్న లక్ష్మణ్ గొంతు నులిపి హత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారణకు వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగ నాగ కార్తిక్ పేర్కొన్నారు.
[zombify_post]