పత్రికా ప్- అరకు లోయ మండలం లో నకిలీ కుల దృవపత్రం జారీపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అందుకు బాధ్యులైన సిబ్బంది పై చర్యలకు ఉపక్రమించారు. ఒక వాలంటీర్ తో పాటు మండల కార్యాలయం రెవెన్యూ సిబ్బంది పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో ఎక్కడైనా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
అరకులోయ మండలం పెదలబుడు సచివాలయం ఫరిధిలో గల కొండ వీధికి చెందిన పిట్టల రాంబాబు అనే వ్యక్తికి ఎస్టీ భగత కుల దృవీకరణ పత్రం జారీపై ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్య వేదిక చేసిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించి వెంటనే విచారణకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు అరకు లోయ తహసిల్దార్ వేణుగోపాలరావు మంగళవారం విచారణ చేపట్టిన విషయం విధితమే. సంబంధిత వ్యక్తిని ఆధారాలతో విచారణకు హాజరు కావలసినదిగా కోరినప్పటికీ ఎటువంటి ఆధారాలు లేకుండా విచారణకు హాజరైనందున విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసినట్లు తహసిల్దార్ వేణుగోపాలరావు తెలిపారు. కాగా 20వ తేదీన విచారణ చేపట్టి పూర్తి నివేదికను జిల్లా స్థాయి కమిటీకి సమర్పించి గతంలో జారీ చేసిన దృవపత్రం రద్దు చేయటంతో పాటు నిభంధనల మేరకు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసు బుక్ చేయటం జరుగుతుందని తహసిల్దార్ వేణుగోపాలరావు వివరించారు. అదేవిధంగా శరభగుడ గ్రామంలో ఒడిషాకు చెందిన వ్యక్తి వాల్మీకి దృవపత్రంతో చలామణి అవుతున్నట్లు దృష్టికి వచ్చిందని, దానిపై కూడా విచారణ జరిపి తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
[zombify_post]