అక్టోబర్ 9న ఏజెన్సీ బంద్ ను జయప్రదం చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు పిలుపునిచ్చారు.మంగళవారం దుమ్ముగూడెంలో జరిగిన ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోయం కామరాజు గారు మాట్లాడుతూ 1970 సం"తర్వాత ఏజెన్సీ ప్రాంతంలోనికి వలస గిరిజనేతరులు 5వ షెడ్యూల్డ్ భూభాగంలోకి వలసలు వచ్చి అభివృద్ధి ఫలాలు,ఉద్యోగ అవకాశాలు కావాలని అడగటం ఏంటని ప్రశ్నించారు. ఆదివాసులకు దక్కవలసిన ఉద్యోగ,ఉపాధి రంగాలలో ఉద్యోగాలను గిరిజనేతరులు దోచుకోవడానికి ఆదివాసుల నిరాధారమైన జీవోలను కుట్రపూర్తిగా కోర్టుల ద్వార కొట్టివేయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివాసి రిజర్వేషన్లను పొందాలని వలస గిరిజనేతరులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఏజెన్సీ ప్రాంతంలో జీవో నంబర్ 3 ను మిని అసెంబ్లీ అయినటువంటి ట్రైబల్ అడ్వైజయిరీ కమిటీలో మరియు అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టంగా మార్చాలన్నారు.5వ ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఆదివాసి నిరుద్యోగులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలనీ అక్టోబర్ 9న ఏజెన్సీ బందుకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు.5వ షెడ్యూల్డ్ భూభాగంలోని ఆదివాసీల చట్టాలు,హక్కులు,జి.ఓ ల అమలు కొరకు ఆదివాసి ప్రజలు,యువత,నిరుద్యోగులు అధిక సంఖ్యలో ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పాండ్రు హేమ సుందర్, ములుగు జిల్లా కన్వీనర్ పర్శీక సతీష్, వెంకటాపురం మండల , మండల ప్రధాన కార్యదర్శి కంతి నేత్రనంద్ కుమార్, పూనెం రవీందర్, వాజేడు మండల అధ్యక్షులు లోడిగ నరసింహారావు, చినబుల్లి, దుమ్ముగూడెం మండల అధ్యక్షులు కుర్సం రవి, కోర్స చందు,రేసు ఆదినారాయణ, కుర్రం బుర్రయ్య,తెల్లం గణపతి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]