దుమ్ముగూడెం మండలంలోని కాటాయగూడెం గ్రామంలో డాక్టర్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాపిడ్ ఫీవర్ సర్వే ప్రోగ్రాంను నిర్వహించారు. వర్షాకాలం సాధారణంగా వచ్చే వ్యాధులపై ప్రజలకి అవగాహన కలిగే విధంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఇంటి లోపల గల నీటి వనరుల్లో గల దోమ లావర్లను కనుగొని డ్రమ్ములు నీటి తొట్టెలు పాత టైర్లు కొబ్బరి బోండాలు కూలర్లు ఫ్రిడ్జ్ రోలు వారంలో రెండు రోజులు మంగళవారం శుక్రవారం శుభ్రం చేసుకోవాలని నీటి నిల్వలు ఉన్న గుంటలో ఆయిల్ బాల్స్ ను వెయ్యాలని చూపించారు ఇలా చేయడం వలన దోమల పెరుగుదలను నియంత్రించే వీలు కలుగుతుందని అలాగే ఇంటి చుట్టు పక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలం నీరు కలుషితం అవుతుంది కావున నీటిని కాచి చల్లార్చి తాగాలని తెలియజేశారు అలాగే జ్వరం వచ్చిన వెంటనే ఆరోగ్య కార్యకర్తలు కానీ ఆశా కార్యకర్తలు గాని దగ్గర రక్తపరీక్ష చేయించుకోవాలని ప్రజలకి సూచించారు ఆర్ఎంపీలని ఆశ్రయించకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకోవాల్సిందిగా సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారెడ్డి హెల్త్ అసిస్టెంట్ గంగాధర్ గౌడ్ ఏఎన్ఎం లీలాకుమారి ఆశాలు అరుణ రమణ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]