చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా బుధవారం ఏలూరు నగరంలోని వసంత మహాల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ముందుగా నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం నిరసన దీక్ష చేపట్టారు. టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చంటి, మాజీ ఎంపీ మాగంటి బాబు దీక్షలో పాల్గొన్నారు. పోలీసులు శిబిరం వద్దకు చేరుకోవడంతో ఒకసారిగా టిడిపి శ్రేణుల నినాదాలు హోరెత్తాయి.
[zombify_post]