డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం : అర్జీదారుని సంతృప్తి ధ్యేయంగా పూర్తి నాణ్యత ప్రమాణాలతో అర్జీల పరిష్కార సరళి ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లా స్థాయి అధికారులు ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన (జగనన్న కు చెబుదాం) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ స్పందనలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్ అజయ్, పౌరసర ఫరాల జిల్లా మేనేజర్ ఎస్ సుధా సాగర్ లు అర్జీ దారుల నుండి సుమారుగా 73 అర్జీలను స్వీక రించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా పూర్తి నాణ్యత ప్రమాణాలతో పరిష్కరించే రీతిలో పరిష్కార సరళి ఉండాలని స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదుల విభాగానికి పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలను ఎటువంటి జాప్యాలకు తావు లేకుండా నిర్ణీత కాలవ్యవధి లో అర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశిం చారు.వివిధ శాఖలకు సంబందించి వచ్చిన అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకొని అర్జీదారులకు న్యాయం చేకూర్చాలన్నారు. జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అర్జీదారునికి అందించే సమాచారం పూర్తి వివరాలుతో స్పష్టంగా నాణ్య తతో కూడిన విధంగా ఉండాలన్నారు.అధికారులు ప్రజల నుంచి వచ్చే అర్జీలు పట్ల అత్యంత శ్రద్ధ వహించి పరిష్కార మార్గాలు చూపాలన్నారు.స్పందన సమస్యలపై అధికారులు తమ లాగిన్ వచ్చిన సమస్యలు పరిష్కారంపై సకాలంలో దృష్టి పెట్టాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతివారం రెండు మండలాల పరిధిలో స్పందన (జగనన్నకు చెబుదాం) నిర్వహించాలని ఆదేశించిందని ఆ మేరకు గత శుక్రవారం రామచంద్రపురం మండలంలో నిర్వహించడం జరిగిందని ఈనెల 13వ తేదీ మొదటగా బుధవారం కొత్తపేట మండలంలో స్పందన కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయించామన్నారు. జిల్లా స్థాయి అధికారులు మండలాల పరిధిలో తమ శాఖలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు సామాజిక వర్గాల సమస్యలు గ్రామాల, మండలాల పరిధిలో ఏమైనా ఉన్నట్లయితే ముందుగానే తెప్పించుకుని వాటి పరిష్కారం పై దృష్టి పెట్టాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు మండల స్పందనకు వచ్చిన సందర్భంలో అర్జీ సమస్యల పైన కాకుండా గ్రామాలు , మండల స్థాయి పెండింగ్ సమస్యలపైన మీ మీ శాఖలకు సంబంధించిన క్షేత్రస్థాయి సమస్యలపైన ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారంపై చర్యలు గైకొనాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మండలానికి ఒక్కొక్క జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టు చొప్పున ఎంపికైన 20 మంది అభ్యర్థులకు నియమాకపు పత్రాల తోపాటు పని చేయాల్సిన మండలాలను కేటాయిస్తూ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు జిల్లా వ్యవసా య అధికారి ఏ బోసు బాబు డ్వామా పిడి ఎస్ మధుసూదన్, జిల్లా అటవీశాఖ అధికారి ఎంవి ప్రసాద్ రావు డిఆర్డిఏ పిడి వి శివశంకర్ ప్రసాద్, మత్స్య శాఖ జెడి షేక్ లాల్ మహమ్మద్ గ్రామ వార్డు సచివాలయం నోడల్ అధికారి కే. భీమేశ్వరరావు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి సిహెచ్ బాబురావు డిఎస్ఓ ఏ పాపారావు ఏడిఎం అండ్ హెచ్ ఓ ,సిహెచ్ వి భరత లక్ష్మి, వివిధ శాఖలకు చెందిన జల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
[zombify_post]