ఖమ్మం మున్నేరు వరద ముంపుకు గురైన నిర్వాసితులకు ఖమ్మం దంసలావురం లోని కందగట్ల ఫంక్షన్ హాల్ నందు బాధితులకు ఆర్ధిక సాయం చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. బాధితులను ఆదుకునేందుకు మంత్రి పువ్వాడ విజ్ఞప్తి మేరకు రూ.కోటి వితరణ చేసిన ఎంపి బండి పార్థసారథి రెడ్డి, మంత్రి కోడలు అపర్ణ తన తాతయ్య కంపెనీ నుండి రూ.50లక్షలు వితరణ మొత్తం కలిపి రూ.1.50కోట్ల విలువైన చెక్కులను రెండు రోజుల పాటు అర్హులైన 1,718మంది కుటుంబాలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణి చేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు, నాయకులు ఆళ్ళ అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.
[zombify_post]