సాగులో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని ఏఎ పి,ఏవి ఎస్ పి నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం కొత్తపల్లి ఆదివాసీ రైతులతో కలిసి ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో దుమ్మగూడెం తహసిల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే పెండింగ్ ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని లేని ఎడల ఆదివాసి రైతులతో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కార్యాలయముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర,ఏ ఎస్ పి మండల కన్వీనర్ రేస్ ఆదినారాయణమూర్తి, నాయకులు సోందె నాగేశ్వరావు,కోరం మురళి, కోర్స రామచంద్రయ్య,మర్మం వెంకటేశ్వరరావు,పొడియం సీతయ్య,కల్లూరి వరలక్ష్మి పూనెం సీతమ్మ,ఆదివాసి రైతులు తదితరులు పాల్గొన్నారు…
[zombify_post]