డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పొట్టితిప్ప గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వాణి ట్రస్ట్ ఆర్థిక సహకారముతో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఆలయ కమిటీ గ్రామస్తులు అత్యంత వైభవంగా నిర్వహించుకుని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మా గ్రామంలో మా పూర్వీకుల నుండి నాగదేవతగా కొలుసుకుంటూ పూజలు చేస్తున్న ఒక చెట్టు ఒక చిన్న విగ్రహం వరదలు టైంలో మునుగుతూ ఎండలో ఎండుతూ కాలక్రమేనా గోదావరిలో కలిసిపోవడం జరిగింది గుడి కట్టుకొనుటకు ఆర్థిక స్తోమత లేక ఎదురుచూస్తున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణాకటాక్షాలతో మా స్వామిని మేము నిండు మనసుతో పూజించుకోవడానికి ఒక చక్కని దేవాలయాన్ని నిర్మించినందుకు మేమందరము ఎంతో ఆనందిస్తూ ఆ స్వామివారికి సమరసత సేవా ఫౌండేషన్ వారికి ఎంతో రుణపడి ఉంటామన్నారు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయమఎంతో ప్రసిద్ధి చెంది భక్తులతో ద్వేదీప్య మానంగా వెలుగొందు తుందని కమిటీ వారన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జిల్లా సంఘ చాలక్ గొదాశి గంగరాజు మాట్లాడుతూ గుడి కేంద్రముగా మన ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ స్వామిని పూజించిన మానసిక ప్రశాంతత పొంది మంచి వృద్దిలోకి వస్తారన్నారు ఎస్.ఎస్. ఎఫ్ జిల్లా కన్వీనర్ వాకాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ గుడి ఆధారంగా మన ధర్మాన్ని కాపాడుకోవాలని అన్నారు స్థలదాత తాడి నరసింహారావు మాట్లాడుతూ హిందూ దేవాలయాలు సమాజానికి పట్టుకొమ్మలాంటివి ప్రతి గ్రామానికి గుడి బడి బాగుంటే సమాజం బాగుంటుందన్నారు జిల్లా మహిళా కన్వీనర్ యనమదల లక్ష్మి మాట్లాడుతూ దేవాలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రముగా వెలుగొందే విధంగా ప్రతి పౌర్ణమి ప్రతి పౌర్ణానికి హారతి వారం వారం భజన ప్రతి పౌర్ణమికి నగర సంకీర్తన చేయడం వలన మనలో చైతన్యం పెరుగుతుందన్నారు గోదావరి జోన్ ధర్మ ప్రచారక్ జగన్నాధరావు మాట్లాడుతూ గుడి ఆధారంగా బాలవికాష్ నిర్వహించడం వలన పిల్లలకు చదువు సంస్కారం నైతిక విలువలు పెరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సలాది రామచంద్రరావు ఆధ్యాత్మిక సేవకులు గొలకోటి వెంకటరెడ్డి మంగతాయారు దంపతులు మండల కమిటీ సభ్యులు పెన్నాడ శివ నాగరాజు గుత్తుల లక్ష్మీ దుర్గ కాట్రేనికోన మండల కన్వీనర్ మట్ట సూరిబాబు పితాని శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యులు సాధనాల పండు చిన్నం మురళి గడ్డం కృష్ణమూర్తి గడ్డం శ్రీను గుత్తాల అరుణకుమారి వాకపల్లి లోవరాజు ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మప్రచారక్ బొంతు కనకారావు జిల్లా ధర్మ ప్రచారక్ కే.ధర్మారావు పాల్గొన్నారు
[zombify_post]