in ,

తల్లిని కాపాడబోయి విద్యుత్ షాక్ తో కుమారుడు మృతి

ఖమ్మం జిల్లా వేంసుర్ మండలం భీమవరం గ్రామంలో విషాదం నెలకొంది.విద్యుత్ షాక్ కు గురై వెంకటేశ్వరరావు (28) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. భీమవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు ఉదయం ఇంటిలో స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురైన తల్లిని కాపాడే క్రమంలో వెంకటేశ్వరరావు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి నీ రక్షించే ప్రయత్నం లో కొడుకు మృత్యువాత పడటంతో గ్రామం లో విషాదం నెలకొంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సత్తుపల్లిలోని ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. విద్యుత్ షాక్ తో చనిపోయిన వెంకటేశ్వరరావు మృతదేహాన్ని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సందర్శించి నివాళులు అర్పించారు.

[zombify_post]

Report

What do you think?

మాదిగల పట్ల కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలి

చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సండ్ర