in ,

క్రీడా పోటీలు వాయిదా

కల్లూరు మండల స్థాయి పాఠశాలల క్రీడలు ఈనెల 12 13 తేదీలలో నిర్వహించుకొనుటకు నిర్ణయించడం జరిగినది. కానీ అట్టి తేదీలలో నిర్వహించుకొనటానికి భారీ వర్ష సూచన, క్రీడా ప్రాంగణమునందు నిన్న మొన్న కురిసిన వర్షాల కారణంచేత వర్షపు నీరు నిండి ఉన్నది. క్రీడల నిర్వహించుకొనటానికి అనువుగా లేని కారణము చేత ఈ తేదీల్లో పోటీలను వాయిదా వేయడం జరిగినది. తిరిగి మరల ఎప్పుడు నిర్ణయించేది అనేది మీకు సమాచారం అందించగలమనీ కల్లూరు మండల విద్యాశాఖ అధికారి ఎం దామోదర ప్రసాద్ తెలిపారు. అలాగే మండల కన్వీనర్ ఏ రమేష్, ప్రభుత్వం ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్, కల్లూరు మండల వ్యాయామ విద్య విభాగ సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు పసుపులేటి వీర రాఘవయ్య, వ్యాయామ దర్శికులు తప్పెట లక్ష్మీనరసయ్య, పీవీ సత్యనారాయణ రెడ్డి, కేరాధాకృష్ణ, జి విజయ కుమారి ప్రకటనలో తెలిపారు. కావున అందరూ గమనించగలరు. అలాగే మీ పిల్లలను క్రీడల యందు సంసిద్ధులను చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.

[zombify_post]

Report

What do you think?

తిరుపతి: చంద్రబాబుకు రిమాండ్ ఎఫెక్ట్.. పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లకు సెలువు.