సత్తుపల్లి సీటు కోసం దరఖాస్తు చేసుకున్న వక్కలగడ్డ..
సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ అడిగే హక్కు మాదిగ సామాజిక వర్గం నుంచి తనకే ఉందని పీసీసీ మాజీ కార్యదర్శి వక్కలగడ్డ సోమ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం సత్తుపల్లిలో విలేఖర్లతో మాట్లాడుతూ దివంగత మాజీ శాసన సభ్యులు వక్కలగడ్డ ఆదాంకు సమీప బంధువు అయిన తాను 1982 నుంచి ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ముందున్నట్లుగా తెలిపారు. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్ యుఐ, యువజన కాంగ్రెస్ లో అనేక పదవులు చేపట్టి గ్రామస్థాయి నుంచి పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డానన్నారు. పిసిసి కార్యదర్శిగా సేవలందించి రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం తన వంతు కృషి జరిపినట్లుగా పేర్కొన్నారు. మధిరలో దాదాపు 50 వేల పైచిలుకు మాదిగల ఓట్లు ఉన్నాయని, సత్తుపల్లి లోనూ సుమారు 45 వేల ఓట్లు ఉన్నాయన్నారు. గతంలోనూ రెండు అసెంబ్లీ స్థానాల్లో ఏ ఒక్క దాంట్లోనూ మాదిగలకు అవకాశం కల్పించలేదని, కనీసం పిసిసి కమిటీల్లోనూ ఆకాశం రాలేదని, ఈసారి కూడా అదే పద్ధతిన కాంగ్రెస్ వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన పెద్ద నాన్న వక్కలగడ్డ ఆదాం ఆశయ సాధన కోసం దళితులకు సేవలందించాలనే లక్ష్యంతో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేసినట్లుగా తెలిపారు. పిసిసి లేదా డిసిసి కమిటీల్లో అవకాశం కల్పిస్తూ సత్తుపల్లి సీటు తనకు కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. పై విషయాన్ని తెలియజేస్తూ ఎఐసిసి నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, కొప్పుల రాజు తదితరులకు దరఖాస్తు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.
[zombify_post]