-మళ్ళీ మంచి రోజులు వస్తాయి కాంగ్రెస్ నీ ఆదరించి గెలిపించండి.
– కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మేడిపల్లి సత్యం
-కాంగ్రెస్ లో పార్టీలో చేరికలు
-పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మేడిపల్లి సత్యం
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని విలసాగర్ గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మేడిపల్లి సత్యం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆశీర్వాదాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామన్నారు. మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టి లకు రిజర్వేషన్ పెంచడంతో పాటు అంబేడ్కర్ అభయ హస్తం పథకం కింద ప్రతీ కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ గృహా పథకం కింద 5 లక్షల రూపాయల సహాయం అందిస్తామని, అలాగే దళిత గిరిజనులకు 6 లక్షల రూపాయలు చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీంరెడ్డి మహేశ్వర్ రెడ్డి, ఎంపిటిసి సభ్యుడు ఉయ్యాల శ్రీనివాస్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి,ఏనుగుల కనకయ్య, కట్ట లక్ష్మణ్,పొన్నం మధు, కౌడగాని వెంకటేష్, సురేందర్, అనిల్, ఎల్లేష్, ఎండి బాబు, వంశీ గౌడ్, లచ్చయ్య, రాజశేఖర్, హరికృష్ణ, పెండ్లి నాగరాజు నిమ్మ వినోద్ రెడ్డి, ఆకుల అజయ్, అనిల్, రాకేష్ ,శ్రీనివాస్ , రఫీ,కనుకయ్య, నక్క శ్రీకాంత్, సాయి, ఎండీ నజీర్, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]