- బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈనెల 15 వ తారీకు శుక్రవారం రోజున మధ్యాహ్నం 11.30 గంటలకు మెడికల కళాశాల మంజూరి చేసినందుకు గాను సిరిసిల్ల సెస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞత చెబుతూ నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగిస్తారు.
కావున బోయినిపల్లి మండల బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ సెస్ కార్యాలయం వద్దకు 11 గంటలకు చేరుకొని ర్యాలీలో మనము అందరూ పాల్గొనాలి. అందువలన శుక్రవారం ఉదయం 9.30 వరకు అందరూ కోదురుపాక రైతు వేదిక వద్దకు రాగలరు అని విజ్ఞప్తి. ఇక్కడి నుండి అందరం కలిసి సెస్ ఆఫీస్ వద్దకు ర్యాలీ బయలుదేరి వెళ్దామని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్ రావు ,వైస్ ఎంపీపీ నాగయ్య, రైతుబంధు అధ్యక్షుడు లచ్చిరెడ్డి , బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు కట్ట గోవర్ధన్ గౌడ్,ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
[zombify_post]
