కరంగర్ జిల్లా. *బిఆర్ఎస్ తోనే యువతకు భవిత*… బిఆర్ఎస్ లో చేరిన బిజెపి నేతలు
గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి గంగుల
పార్టీ బలోపేతానికి కృషి చేయాలంటూ సూచన
బిజెపి నుండి బీఆర్ఎస్ లకి వచ్చిన కార్యకర్తల రాజకీయ భవిష్యత్తు నా బాధ్యత
వారికి అన్ని రకాలుగా అండగా ఉండి… తగురీతిలో గౌరవించుకుంటాం
*నాకోసం మీరు ఐదు నెలలు పని చేయండి*…
*మిమ్మల్ని ఐదు సంవత్సరాలు కడుపులో పెట్టుకొని చూసుకుంటా*
మరోసారి నా చేతులను బలోపేతం చేయండి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాను
మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను
*చేరికల కార్యక్రమంలో మంత్రి గంగుల*
బిజెపి నుండి బిఆర్ఎస్ లోకి వచ్చిన వారికి రాజకీయ భవిష్యత్తు నా బాధ్యత అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు… వారికి అండగా ఉండడంతో పాటు… పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు..
నేడు ఆదివారం స్థానిక గోపికృష్ణ ఫంక్షన్ హాల్ లో బిజెపి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యా వర్గ సభ్యులు మంథేన కిరణ్, ఆధ్వర్యంలో…..గోస్కుల మహేష్, పరంకుశం త్రినాథ్ శీలం అజయ్, చిగుర్ల అజయ్ పెట్టెం సుధాకర్, ప్రకాష్ ఆచార్య, బూర్ల హేమంత్, ప్రసన్న కృష్ణ, రాజు, శ్యామ్ లతో పాటు 300 మంది హిందూ వాహిని,బీజేవైఎం లకు లకు చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరినారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరై పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు..ఈ సందర్బంగా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి.. బిజెపిలో చేరిన మంతెన కిరణ్ బృందం భారీ గజమాలతో సత్కరించారు..
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బిజెపిలో పార్టీ కోసం కష్టపడ్డ వారికి… సరైన గుర్తింపు లభించడం లేదని… వారు ఆత్మగౌరవం కోసం బిఆర్ఎస్ లోకి వస్తున్నారని అన్నారు..మీరు నాకోసం ఐదు నెలల పాటు కష్టపడితే… నేను 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటానని హామి ఇచ్చారు. మరోసారి నా చేతులను బలోపేతం చేస్తే…. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి… కరీంనగరాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుతానన్నారు.. బిజెపి నుండి బీఆర్ఎస్ లకి వచ్చిన కార్యకర్తల రాజకీయ భవిష్యత్తు వారి భద్రత నా బాధ్యతేనన్నారు.. వారికి అన్ని రకాలుగా అండగా ఉండి… తగురీతిలో గౌరవించుకుంటామన్నారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత పరిస్థితులు వేరుగా ఉండేవని… గత పాలకులకు కరీంనగరాన్ని అభివృద్ధి చేయాలనే మనసు రాలేదన్నారు.
గతంలో అధికారులు… కరీంనగర్ జిల్లాకు బదిలీపై రావాలంటే పనిష్మెంట్ గా భావించే రోజులుండేవన్నారు. సమైక్య పాలనలో నిధులు రాక… అభివృద్ధి కాక… కరీంనగర్ అధ్వానంగా మారిందన్నారు. 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత… నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు వెళ్లి… కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు కావాలని అడిగితే… వెకిలిగా నవ్వారే తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదనవ్యక్తం చేశారు. సమైక్య పాలకులు ఇప్పటి వనరులను ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నారే తప్ప… ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసే ఆలోచన చేయలేదన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత స్వయం పాలనలో కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వందల కోట్ల నిధులను కేటాయించారని… వీటితో నగరాన్ని గొప్పగా అభివృద్ది చేశామన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న ఇక్కడి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా… ఇక్కడే ఐటి హబ్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కరీంనగర్ అన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో… కేబుల్ బ్రిడ్జి… మానేరు రివర్ ఫ్రంట్ లను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని… మరో 6 నెలల్లో మానేరు రివర్ ఫ్రంట్ ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జి లతో కరీంనగర్ దేశంలోనే గొప్ప నగరంగా మారనుందని… కరీంనగర్ ను ఇంకా గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఐటీ… టిటిడి టెంపుల్… కేబుల్ బ్రిడ్జ్… మానేరు రివర్ ఫ్రంట్… మెడికల్ కాలేజీల రాకతో ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు బారాస నగర అధ్యక్షులు చల్లాహరిశంకర్ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, కార్పొరేటర్లు గందె మాధవి మహేష్, వాల,రమణారావు దిండిగాల మహేష్ ఐలేందర్ యాదవ్ బండారి వేణు,గంట శ్రీనివాస్తదితరులు పాల్గొన్నారు
[zombify_post]