in , , ,

జగన్ పైశాచిక ఆనందం పరాకాష్టకు చేరింది –

కరీంనగర్ జిల్లా

*జగన్ పైశాచిక ఆనందం పరాకాష్టకు చేరింది – తెలుగు దేశం పార్టీ*

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ నియోజకవర్గంలోని కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం తరఫున రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కళ్యాణపు  ఆగయ్య, పట్టణ అధ్యక్షులు రొడ్డ శ్రీధర్ గార్ల ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్టును  ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం రాష్ట్ర పార్టీ కార్య నిర్వాహక  కార్యదర్శి కళ్యాణపు ఆగయ్య పట్టణ అధ్యక్షులు రొడ్డ శ్రీధర్ గార్లు మాట్లాడుతూ   చంద్రబాబు అరెస్ట్ ఒక మైండ్ గేమ్, రాజకీయ కుట్ర. గవర్నర్ గారికి తెలియకుండా,ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చంద్రబాబు గారిని సిఐడి అరెస్టు చేయడం విడ్డూరంగా ఉంది. సైకో జగన్ రెడ్డి ఓటమి భయంతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారు. చంద్రబాబును అరెస్టు చేసినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లో టిడిపి విజయాన్ని జగన్ రెడ్డి అడ్డుకోలేరు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ చెప్పిందే చట్టం ఆయన చేసింది న్యాయం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. జగన్ దృష్టిలో శాంతిభద్రతలను నిలబెట్టడం అంటే తన వ్యతిరేకులను కళ్ళు పొడవవడమే  ఇది నిదర్శనం. చట్టబద్ధమైన పాలన చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక అవకాశం ఇస్తే పగతో కళ్ళకు పొరలు కమ్మిన సైకో జగన్ రెడ్డి కళ్ళలో వికృత ఆనందం చూడటం కోసమేనా ఈ అరెస్టులు. సీఐడి పోలీసుల అత్యుత్సాహం చూస్తుంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని సంతృప్తి పరచాలన్నట్టే ఉన్నది. జనాన్ని దోచుకునే చెడ్డి గ్యాంగ్ తరహాలోనే జగన్ గ్యాంగ్ రాష్ట్రంలో చెలరేగిపోయి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. గవర్నర్ గారిని కలిసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తే వారిని హౌజ్ చేసి గవర్నర్ ను కలవనీయకుండా చేయడం దుర్మార్గం. అసలు ఆంధ్రప్రదేశ్ లో లాండ్ ఆర్డర్ ఉందా అది పూర్తిగా అదుపు తప్పిందని ప్రజలు భావిస్తున్నారు. వెంటనే చంద్రబాబును విడుదల చేసి లాండ్ ఆర్డర్ లేని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని కోరుతున్నాము.

ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపెల్లి రవీందర్, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి రవీందర్, సాయిల్ల రాజమల్లయ్య, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు పటేల్, పార్లమెంట్ ఉపాధ్యక్షులు సందబోయిన రాజేశం, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తీగుట్ల రమేష్, పార్లమెంట్ అధికార ప్రతినిధి దాసరి రామకృష్ణారెడ్డి, పార్లమెంట్ కార్యదర్శి పెరుమాండ్ల సతీష్ గౌడ్, ఎండి యూసుఫ్ , పార్లమెంట్ వాణిజ్య సెల్ అధ్యక్షులు ఎలిమిల కిషన్, సీనియర్ నాయకులు రొడ్డ శ్రీనివాస్,పట్టణ ఉపాధ్యక్షులు ప్రభాకర్,మేకలరాజమల్లు,తదితర నాయకులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Rajendra

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Trending Posts

రైతు భరోసా కేంద్రo. సచివాలయం త్వరగా నిర్మించాలి!

నల్లగా మారిన విశాఖ సాగరతీరం