ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణను పున నిర్మించుకోవాలి..
-ఏ ఐ ఎఫ్ బి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి
కరీంనగర్ జిల్లా ప్రతినిధి:-
చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణను పున నిర్మించుకోవాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ
రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం రోజున ఐలమ్మ వర్ధంతి పురస్కరించుకొని కరీంనగర్లో ఐలమ్మ విగ్రహానికి
పార్టీ నేతలతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీ పీడన నుంచి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని ఐలమ్మ స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆనాడు ఐలమ్మ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఈరోజు అదే దొరలు మళ్లీ ఊళ్ళల్లో పెత్తనం చేస్తున్నారని ఆమె స్ఫూర్తితో మనమందరం ఒకటే మరో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మహానీయులు పోరాటాలు భావితరాలకు తెలువాలని కేవలం జయంతికి వర్ధంతిలకు నివాళులర్పిస్తానే తెలువదని ఐలమ్మ పేరు మీద ప్రత్యేక యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకి ఐలమ్మ పేరు పెట్టాలని జోజి రెడ్డి డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెద్దెలి శేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజశేఖర్ గౌడ్,
నగడ అధ్యక్షుడు సూర్యారావు, కార్మిక సంఘం నాయకుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు
[zombify_post]