నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించి మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ఆదివారం పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల యాసంగిలో నష్టపోయిన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వేల నష్టపరిహారం అందిస్తుందని చెప్పి ఇప్పటివరకు రైతులకు ఇవ్వలేదని అన్నారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి వారి ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలని సూచించారు.
[zombify_post]