in , ,

పర్యావరణ పరిరక్షణ ద్వారా పుడమి భద్రంగా ఉంటుంది.. డిప్యూటీ సియం ముత్యాలనాయుడు.

దేవరాపల్లి, అనకాపల్లి జిల్లా :
ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల జోలికి పోకుండా మట్టి ప్రతిమలను పూజించాలని డిప్యూటీ సియం ముత్యాలనాయుడు తెలిపారు. భారత నిర్మాణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సమకూర్చిన మట్టి వినాయక విగ్రహాలను తారువ లోని  డిప్యూటీ సీఎం కార్యాలయంలో మంత్రి బూడి ముత్యాలనాయుడుకి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పర్యావరణ  పరిరక్షణ ద్వారా పుడమి భద్రంగా ఉంటుందని అందుకు అందరు కృషి చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని అన్ని చోట్ల వాతావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని, భారత నిర్మాణ సేవా ట్రస్ట్ గత పది సంవత్సరాల వేలాదిగా మట్టి ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం పట్ల డిప్యూటీ సిఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గౌరీపట్టపు మహేష్ కుమార్, పేలూరి కృపారావు, కొప్పాక రాంకీ, పెద్దపాటి నాగరాజు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

నూతన సీసీ రోడ్ల నిర్మాణం

ఖమ్మం జిల్లా నూతన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం