టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు కు నిరశనగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆదివారం పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ…. కేవలం రాజకీయ కుటచరలో భాగంగానే చంద్రబాబు నాయుడు ను జగన్ ప్రభుత్వం అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఇటీవల కాలంలో టీడీపీ కీ వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా ఆదివారం మధ్యాహ్నం నుంచి పాడేరు వర్షం కురుస్తున్నా టీడీపీ నాయకులు నిరాహారదీక్ష కు కొనసాగిస్తున్నారు.
[zombify_post]