రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ
వలసలతో మాత్రమే ఉండే పాలమూరు జిల్లాను పచ్చగా చేస్తుంది ఈ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మాత్రమే అని అన్నారు.ప్రతి ఏటా లక్షలమంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేది,కానీ నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం అని, పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా భూములకు సైతం నీళ్లు అందిస్తుంది అని అన్నారు.గోదావరిలో కాలేశ్వరం, కృష్ణాలో పాలమూరు-రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కట్టింది.సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తి అవుతాయి అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ నాయకత్వంలో కట్టిన ప్రాజెక్టులను చూసి కేవలం తెలంగాణ బిడ్డగానే కాకుండా భారతదేశ పౌరుడిగా కూడా గర్వంగా ఉంటుందన్నారు.ఈ ప్రాజెక్టుల నిర్మాణం వెనక 2001 నుంచి కన్న తెలంగాణ ప్రజల కల ఇది. ఉద్యమ కాలం నుంచి కెసిఆర్ ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు ఇది అని అన్నారు.పాలమూరు రంగారెడ్డి ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది అని,అనేక అడ్డంకులను దాటుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో పూర్తయిన ప్రాజెక్టు ఇది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటి శంకర్, వెంకట్ రెడ్డి, నందయ్య, అనిల్, సంజీవ్ కుమార్, పూర్ణచందు, కమల్ గౌడ్, మంద వెంకటేష్, ర్యాకం రాజేష్, కన్నం సాగర్ పాల్గొన్నారు.

[zombify_post]