in , ,

అంతర్‌ రాష్ట్ర జిల్లాల సరిహద్దు గల ఎస్పీ ల సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో రాబోవు అసెంబ్లీ ఎన్నికలు సజావుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  నిర్వహించేందుకు ముందస్తు చర్యలలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా  బోధన్ లో  అంతర్‌ రాష్ట్ర /జిల్లాల సరిహద్దు గల జిల్లాల ఎస్పీ ల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఇట్టి సమావేశం లో  అంతర్ జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రాంతాలను గుర్తించడం, ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఓటింగ్ సంబంధిత పరికరాల రవాణా మరియు బందోబస్తు ఏర్పాట్ల గురించి, సరిహద్దు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు, మద్యం, ఆయుధాలు మరియు ఇతర అక్రమ రవాణాను నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యల గురించి, VVIPs/VIPల కదలికల  సమయం లో పరస్పర సమాచార మార్పిడి మరియు బందోబస్తు ఏర్పాట్లలో సహకారం, సరిహద్దు ప్రాంతాలలో గత  ఎన్నికల  సమయాలలో జరిగిన నేరాలు మరియు శాంతిభద్రతల సమస్యల పై, ఏదైనా శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే సరిహద్దు జిల్లాల మధ్య పోలీసు బలగాలను త్వరితగతిన చేరుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై, గత ఎన్నికల సమయం లో నేరాలకు పాల్పడిన వ్యక్తులను బైండొవర్ చేయడం లో సరిహద్దు జిల్లాల అధికారులు పరస్పర సహకారం ఉండాలన్నారు. ఎన్నికల ముందు, ఎన్నికల సమయం లో నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న అనుమానితులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.
ఈ యొక్క సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సత్యనారాయణ ఐపీఎస్ , జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ , నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ , ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్  రెడ్డి మరియు అంతర్ ర్రాష్ట్ర/ జిల్లాల సరిహద్దు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Harish

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

ఆంధ్రలో ప్రజాస్వామ్యం అపహాస్యం

చంద్రబాబు అక్రమ అరెస్టుపై టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు ఆత్మహత్యాయత్నం