డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
వినాయక చవితికి నిబంధనలు పాటిస్తూ అనుమతులు పొందాలని స్థానిక ఎస్సై ఎల్.శ్రీను నాయక్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చవితి వేడుకలలో భాగంగా పండగ వాతావరణం రాబోతుందని,ఆలమూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో మండపాల ఏర్పాటు చేసే నిర్వహకులు మాత్రం కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవడంతోపాటుగా పాటించాలన్నారు.ఇచ్చిన నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.విగ్రహం సైజు, బరువు, ఉత్సవం ఎన్ని రోజులు నిర్వహిస్తారు. నిమజ్జనం చేసే తేదీ, కమిటీ సభ్యుల వివరాలను ముందుగానే తెలియజేయలన్నారు. బలవంతపు చందాలు వసూళ్లు చేయరాదన్నారు. మట్టితో తయారుచేసిన విగ్రహాలనే పూజించేందుకు ప్రాధాన్యమివ్వాలి.విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు, మందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.కమిటీ సభ్యులు రాత్రి సమయంలో మండపం వద్ద కాపలాగా ఉండాలన్నారు. శబ్దకాలుష్యం విషయంలో నియమాలు పాటిస్తూ స్పీకర్లు వినియోగించాలన్నారు. మండపాల ప్రదేశం వద్ద ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా,విగ్రహాల ఊరేగింపు సమయంలో అశ్లీల పాటలు వేసినా, డ్యాన్సులు చేసినా కఠిన చర్యలు ఉంటాయన్నారు.మందుగుండు సామగ్రి కాల్చరాదని,వినాయక నిమజ్జన ఊరేగింపు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలన్నారు.అల్లర్లు,ఘర్షణలకు కారణమైన వారిపై, కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
[zombify_post]
