మాచర్ల పట్టణంలోని శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి 1977 – 1983 పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి కంప్యూటర్లు కుర్చీలు బహుకరించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పూర్వపు విద్యార్థులు అందించిన కంప్యూటర్లను కళాశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి ఆర్ కే మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి పూర్వపు విద్యార్థులు చేస్తున్న సహాయ సహకారాలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు విద్యార్థులు ఎమ్మెల్యే పి ఆర్ కె మున్సిపల్ చైర్మన్ మాచర్ల చిన్న ఏసోబు, మండల విద్యాశాఖ అధికారి నాగయ్యలను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు.
[zombify_post]