రూ.10 వేలు ఆర్థిక సాయం అందించిన ఆర్టీసీ ఆనంద్ మిత్రబృందం
ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ 5000 తాము చెల్లిస్తామని హామీ
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో సీటు సాధించిన కల్లూరు మండలం కప్పల మండలం గ్రామానికి చెందిన మేరుగు ఉమామహేశ్వరి ని శనివారం కల్లూరులో శాలువాతో ఘనంగా సన్మానించి పదివేలు ఆర్థిక సాయం అందించిన ఆర్టీసీ ఆనంద్ మిత్రబృందం. శనివారం కల్లూరు లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో సీటు సాధించిన విద్యార్థినినీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిన్నెర ఆనందరావు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆపకూడదని కారణంతో ఏనుకూరు గురుకుల పాఠశాల 1994 బ్యాచ్ B సెక్షన్ పూర్వ విద్యార్థులు 5000 మరియు 2001 బ్యాచ్ పూర్వ విద్యార్థి చందుపట్ల గ్రామం కు చెందిన గొల్లమందల భాస్కరరావు 5000 ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన తెలిపారు . ఉమామహేశ్వరి మంచిగా చదివి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు రాకూడదని తన మిత్ర బృందంతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఈ సందర్భంగా ఆనంద్ తెలిపారు.ప్రతి సంవత్సరం ఆ విద్యార్థికి పాఠశాలలో చెల్లించే ఇన్సూరెన్స్ 5000 రూపాయలను మా బ్యాచ్ పూర్వ విద్యార్థులు చెల్లించే విధంగా ఏర్పాటు చేసినట్లు కిన్నెర ఆనంద్ ఉమామహేశ్వరి తల్లిదండ్రులకు తెలిపారు. కప్పలబంధం సర్పంచ్ నందిగామ ప్రసాద్ మాట్లాడుతూ హకీంపేట స్పోర్ట్స్ స్కూలుకు ఎంపిక కాబడిన ఉమామహేశ్వరి ఆర్థిక ఇబ్బందులు గమనించి ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ 5000 చెల్లించే విధంగా ఏర్పాటు చేసిన ఏనుకూరు గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులను ఆయన సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పి. వీర రాఘవయ్య, కప్పల బంధం సర్పంచ్ నందిగాం ప్రసాద్ విద్యార్థిని తండ్రి అంజయ్య, తల్లి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]