లేబర్ సప్లై ఎజెంట్లపై చర్యలు తీసుకోవాలని జీఎస్పీ రాష్ట్ర నాయకులు పాయం సత్యనారాయణ డిమాండ్ చేశారు.భద్రాచలం మానవహక్కుల సంఘము జిల్లా అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఏజెన్సీ ఆదివాసీలను ఉపాధి కల్పిస్తాము అని శ్రమ దోపిడీ చేస్తూ వేతనాలు చెల్లించ కుండా మోసం చేసే లేబర్ సప్లై ఏజెంట్లపై దృష్టి సారించి లెబర్ కమిషన్ పోలీస్ అధికారులు సంయుక్తంగా చట్ట పరమైన చర్యలు తీసుకోవాలన్నారు.భద్రాచలం పట్టణం లేబర్ సప్లై ఏజెంట్లకి అడ్డగా మారిందని విమర్శించారు.ఆంద్ర, తెలంగాణ,ఛత్తీస్ ఘడ్,మధ్యప్రదేశ్,ఒరిస్సా, రాష్ట్ర ఆదివాసీలకు జిల్లాలో వివిధ మండలలా వెంకటాపురం,చర్ల,దుమ్ముగూడెం,దుమ్ముగూడెం,మిర్చి పంట రైతులు ఉపాధి అవకాశాలు పేరుతో శ్రమ దోపిడీ చేస్తు ట్రాక్టర్ల పై,బోలెర పై,ఆటోలపై, కూలీలను కుక్కి తీసుకెళ్తూన్నా ఏజెంట్ల మాఫియా ని అరికట్టాలి ఉపాధి కల్పిత పేరుతో లేబర్ అక్రమ రవాణా శ్రమ దోపిడీ కనీస వేతనం చెల్లించని వారిపై జిల్లా లేబర్ అధికారులు భద్రాచలం పట్టణ అధికారులు దృష్టి సారించాలి అక్రమంగా లేబర్ సప్లై చేస్తున్న లైసెన్స్ లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా అమాయక ఆదివాసీల ను వివిధ రాష్ట్రాల నుండి వచ్చే వలస స్థానిక కూలీలనే ఏజెంట్లు టార్గెట్ చేస్తున్నారు? వలస కూలీలా వారికి ఉపాధి కల్పిస్తున్నాం అంటూ మోసం చేస్తూ వివిధ రాష్ట్రాల కు తరలింపు వారికి సరైన వేతనాలు ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్నరూ లేబర్ సప్లై పేరుతో ఏజెంట్లు ఏజెంట్ల మాఫియా పై దృష్టి పెట్టని ఉన్నత అధికారులు ఇటువంటి దొంగ ఏజెంట్ల పై దృష్టి సారించాలని వారి మోసాలను అరికట్టి శ్రమ దోపిడీ నుండి ఆదీవాసీలను కాపాడి లేబర్ సప్లై ఏజెంట్ల పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి అని సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ లాయర్ పర్షిక సోమరాజు జూనియర్ లాయర్ కోర్స నరేష్, కాకా సురేష్, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]