అల్లూరి జిల్లా: ఆంధుల క్రికెట్ పోటీల్లో భారత్ విజయానికి కారణమైన గిరిజన క్రీడాకారిణి వలసనైని రవళికి శనివారం ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. పాడేరు మండలం వంతాడపల్లి నుంచి హుకుంపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా రవళిది అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రంసింగిపాడు. ప్రపంచ ఆంధుల క్రికెట్ లో భారత విజయం సాధించడంలో రవళి ప్రత్యేక ప్రతిభను కనబరిచిందని పలువురు కొనియాడారు. అయితే రవళి విశాఖ లో ని ఓ ఆశ్రమంలో చదువుకుంటూ భారత ఆంధుల జట్టులో చోటు సంపాదించుకుంది.
[zombify_post]