ప్రేగుసమస్యతో… ప్రాణాపాయ స్థితి..
వైద్యసహాయం కోసం ఎదురుచూపులు
పుట్టుకతోనే అనారోగ్యంతో అవస్థ. 19 ఏండ్లుగా ప్రేగు సమస్యతో నరకయాతన. అల్లారు ముద్దుగా ఆడుకోవలసిన కొడుకు కళ్ళ ముందే అవస్థ పడు తున్నాడు. కొడుకుని బ్రతికించుకునేందుకు తల్లిదండ్రులు పడుతున్న తపన. వారు రోజువారి కూలికి పోతేనే జీవనాధారం. కొడుకు వైద్యం కోసం లక్షల్లో అప్పులు. ఏమి చేయలేని దీనస్థితి. కట్ చేస్తే మండల పరిధిలోని తూతక్క లింగన్న పేట గ్రామపంచాయతీలో అంబేద్కర్ నగర్ కు చెందిన మోదుగు గోపిరాజ్ స్థితి, మోదుగు నరసింహారావు సుజాత దంపతుల కుమారుడు గోపిరాజ్ పుట్టిన మూడు నెలలు వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు. 3 నెలలు ముద్దు మురిపాలు అందించిన కొడుకును చూసి మురిసిపోయిన దంపతులకు 19 సంవత్సరాలుగా మనోవేదనే మిగిల్చాడు. అకస్మాత్తుగా కొడుకు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో హాస్పటల్ కు తీసుకెళ్లగా ప్రేగు సమస్య ఉందని వైద్యులు తేల్చడంతో ఒక్కసారిగా తల పట్టేసినట్లయ్యింది. అప్పటినుంచి ఇప్పటి వరకు కొడుకు కోసం లక్షల రూపాయలు హెచ్చిస్తూనే వైద్యం అందిస్తున్నారు. లోపం ఎక్కడుందో తెలియదు గానీ ఆపరేషన్ చేయించడం అది వికటించటం జరిగింది. ఈ తరుణంలో కొడుకుపై ప్రేమ తప్ప పెరిగిన అప్పులను లెక్కచేయకుండా హాస్పటల్ చుట్టూ ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు. ఆరు నెలల ప్రాయంలోనే ప్రేగు సమస్యను గు ర్తించిన వైద్యుడు డాక్టర్ రమేష్ సలహా మేరకు హైదరాబాద్ నిలోఫర్ పిల్లల హాస్పిటల్ కు తీసుకెళ్లడం జరిగింది. అప్పటికే పెద్దప్రేగు కుళ్ళిపోవడంతో మలవిసర్జనను ఎడమ భాగంలో కడుపుకి రంధ్రం ద్వారా బయటికి పంపించే విధంగా ఏర్పాటు చేశారు. మూడు సంవత్సరాల తర్వాత మ రల ఆపరేషన్ తో మలద్వారం ద్వారా మలవిసర్జన జరిగే వి ధంగా చేసినప్పటికీ మరలా ఆపరేషన్ వికటించటంతో చిన్న ప్రేగు ప్రత్యమ్మయం అయ్యింది. ఇన్ని సమస్యలు ఉన్నా, తన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోయినా అందరితో కలిసిపోయి ఇంటర్మీ వరకు విద్యను కొనసాగించుకుంటూ వచ్చాడు. అకస్మాత్తుగా కొడుకు ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోవడంతో ఇప్పటికే 19 ఏళ్లుగా వైద్యం చేయిస్తూ ఆర్థికంగా దెబ్బతిన్న తల్లిదండ్రులు తన కొడుకును కాపాడండంటూ ఆర్థిక సహాయం కోసం వేడు కుంటున్నారు. తన కొడుకును కాపాడితే జీవితాంతం రుణపడి ఉంటామని ఆర్థిక సాయం చేయమని దాతలను అర్ధిస్తున్నారు. ఏది ఏమైనా 19 సంవత్సరాలుగా కొడుకు కోసం పడుతున్న ఆవేదన అర్థం చేసుకొని దాతలు ఆదు కుంటే గోపిరాజ్ అందరిలా ఆరోగ్యవంతంగా జీవించే అవ కాశం ఉంటుంది. మానవతా దృక్పథంతో దాతలు ఆర్ధిక సహాయం చేయాలని ఆశిద్దాం… దాతలు వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్ 9347028957 7036263827.

[zombify_post]