in ,

బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి

యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమాలను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు : యువజన కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ ఇంఛార్జి బొగడ శ్రీనివాస్

యూత్ జోడో బూత్ జోడో తో కాంగ్రెస్ విజయం తధ్యం టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్

సత్తుపల్లి పట్టణం లోని  టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానవతా రాయ్ క్యాంప్ కార్యాలయంలో మానవతా రాయ్ అధ్యక్షతన జరిగిన యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువజన కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ ఇంఛార్జి బొగడ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూత్ జోడో బూత్ జోడో  రానున్న రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో యువతే కీలక భూమిక పోషించబోతుంది అని శ్రీనివాస్ అన్నారు.

టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్ మాట్లాడుతూ యువతకు రాజకియ అవకాశాలు ఎక్కువగా ఇచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ప్రతి బూత్ లో 5 బూత్ కమిటీ మరియు 1 డిజిటల్ యూత్ తో మొత్తం 6 గురు కమిటీ వేయడం జరుగుతుంది అని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంతో  పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి బూత్ లో తిరిగి యూత్ జోడో బూత్ జోడో కమిటీ ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మనవతా రాయ్ బోగడ శ్రీనివాస గారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరరావు,సత్తుపల్లి మాజీ ఎంపీటీసీ ఐ కృష్ణ, సత్తుపల్లి మైనారిటీ పట్టణ అధ్యక్షులు ఫజల్ బాబా, పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ బాజీ, యువజన కాంగ్రెస్ నాయకులు షేక్ షఫీ, పసల ఏడుకొండలు, పగలగూడెం బడే సాబ్, ఎల్లంపల్లి ఏడుకొండలు, కోమేపల్లి యాకూబ్, ఈసుబ్ పఠాన్, అవినాష్, కార్తిక్, అబ్దుల్ రహుబు, ఖాదర్ బాబా యువజన కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ఉచిత కంటి ఆపరేషన్లు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

క్రికెటర్ రవళికి ఘన స్వాగతం