రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట్, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతరుల పట్ల సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన 11 మందిని బైండోవర్ చేయడం జరిగిందని అట్టి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీస్ శాఖ సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలు దెబ్బతిసేలా వ్యవహరిస్తూ వ్యక్తిగత విమర్శలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించి అలాంటి వారి పై, వాట్సప్ గ్రూప్ అడ్మిన్ లపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.రాబోవు పండుగల సందర్భంగా, ఎన్నికల సందర్భంగా చట్ట విరుద్ధంగా కులాలు, మతాలు,పార్టీలు,వర్గాల మధ్య విభేదాలు,శత్రుత్వాలు సృష్టించేలా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినా,వాట్సప్ గ్రూప్ లలో ఫార్వార్డ్ చేసిన పోస్టులు పెట్టిన వారితోపాటు ఆ గ్రూప్ అడ్మిన్ లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఎవరైనా గ్రూపులలో పోస్టులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టాలని,అలాగే గ్రూప్ అడ్మిన్ లు ఆ గ్రూప్ పై పూర్తి నియంత్రణ కలిగి ఎలాంటి చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టకుండా, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాలని సూచించారు.
[zombify_post]