మోటార్ సైకల్ నంబరు కనపడకుండా నెంబరు ప్లేటుపైన స్టిక్కర్ అతికించిన వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు తెలిపిన సిరిసిల్ల టౌన్ సి .ఐ ఉపేందర్.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి కి చెందిన కంకణాల వేణు కొన్ని రోజులుగా ట్రాఫిక్ నిబందనలు ఉల్లంగించిన సమయాలలో పోలీసు చాలన్ల నుండి, ఎవరికైనా ఆక్సిడెంట్ చేస్తే సులువుగా తప్పించుకోవడానికి తన మోటార్ సైకల్ వెనక నెంబరు ప్లేటుపైన వాహన రిజిస్ట్రైషన్ నెంబర్ కనిపించకుండా స్టిక్కర్ ను అతికించి మోటార్ సైకల్ పైన తిరుగుచుండగా, సిరిసిల్ల లో గాంధీ చౌక్ సమీపంలో అతడిని పట్టుకొని మోటార్ సైకల్ ను స్వాదీనం చేసుకుని అతడి పైన ఛీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు . కావున ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఎవరయినా తమ వాహన నెంబరు ప్లేటుపైన స్టీక్కెర్స్ అతికించడం గాని, నెంబరు ప్లేట్లను వంచడం గాని లేదా మరే విదంగా గాని రిజిస్ట్రైషన్ నెంబర్లు కనిపించకుండా చేసినట్లైతే వారి పైన కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు.
[zombify_post]