పోషణ మాసోత్సవాల సందర్భంగా చర్ల మండల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని తేగడ,ఆర్.కొత్తగూడెం సెక్టార్ల పరిధిలో పోషణ అభియాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.తేగడ సెక్టార్లోని రాళ్ళగూడెం అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ ఉత్సవాలు సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు ఘనంగా నిర్వహించారు.తేగడ సెక్టార్ సూపర్వైజర్ టి.ఆదిలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేశవాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కోరం నాగేంద్ర, ఐసిడిఎస్ సిడిపిఓ చైతన్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.రాళ్లగూడెం అంగన్వాడి కేంద్రం పరిధిలోని గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతం నిర్వహించారు.గర్భణీలకు పుట్టింటి సారెగా పసుపు కుంకుమలు పెట్టి చేతుల నిండుగా గాజులు తొడిగారు.ఈ సందర్భంగా సిడిపిఓ చైతన్య మాట్లాడుతూ గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలని తద్వారా గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉంటుందని, పుట్టే పిల్లలు ఆరోగ్యకరంగా మంచి ఎదుగుదలతో సరైన బరువుతో పుడతారని తెలిపారు.ఈ సందర్భంగా సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు అందరూ కలిసి పోషక విలువలు కలిగిన వంటకాలు,కూరగాయలు, ఆకుకూరలతో ఏర్పాటు చేసిన స్టాల్ ఆకట్టుకుంది.అంగన్వాడీ కేంద్రాలలో పాలు, పండ్లు, పోషక విలువలు ఉన్న తినుబండారాలు ఇస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకొని గర్భిణీలు పిల్లలు ఆరోగ్యకరంగా తయారవ్వాలని తెలియజేశారు.శమంతక మణి,కమల,కృష్ణవేణి, శోభారాణి,సుభద్ర,కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]