సురక్షితంగా ఒడ్డుకు చేరిన రైతులు..
-సుమారు రెండు గంటల పాటు రిస్క్ ఆపరేషన్…
ముద్ర, గంభీరావుపేట :
పంట పొలాలకు వెళ్లి మానేరు వాగు ఉధృతంగా రావడంతో అక్కడే ఐదు రోజులుగా ఉండిపోయిన రైతులను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డిఆర్ఎఫ్, ఫిషరీస్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా శుక్రవారం సురక్షితముగా బయటకు తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే గంభీ రావు పేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన రైతులు అల్లాడి రాజాం, మెతుకు ఎల్లయ్య గత ఐదు రోజుల క్రితం రామాంజపురం శివారులోని పంట పొలాలకు వెళ్లడంతో, ఎగువ మానేరు మత్తడి దుంకి, మానేరు వాగు ఉదృతంగా రావడంతో అటే ఉండిపోయారు.వారి వెంట ఉన్నా ఆహారం గురు వారం వరకు సరిపోవడంతో,శుక్రవారం వారి పరిస్థితిని గ్రామస్తులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న సిరిసిల్ల కాంగ్రెస్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, బిజెపి మండల అధ్యక్షుడు అశోక్, మాజీ సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్ రైతులను ఫోన్లో పరామర్శించి, భరోసా కల్పించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డిఆర్ఎఫ్, ఫిషరీస్ఫైర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా రెండు గంటల పాటు శ్రమించి రైతులను సురక్షితముగా ఒడ్డుకు చేర్చామని ఎస్సై మహేష్ తెలిపారు. రైతులు ఒడ్డుకు చేరుకోవడంతో గ్రామస్తులు, పోలీసులంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ రిస్క్ ఆపరేషన్లో డి ఆర్ ఎఫ్, ఫిషరీస్, ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .
[zombify_post]