in , ,

తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ గా జగదీష్ బాధ్యతలు స్వీకరణ

రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా  పి. జగదీష్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు, సాధారణ బదిలీలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం ఎస్పీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ… తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాసం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.  జిల్లా పరిస్థితులపై పూర్తి అవగాహన చేసుకుని, సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు చేపడతామని తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలపై దృష్తి సారించి వాటిని అరికట్టేలా చూస్తామన్నారు. మహిళలు, చిన్నారులు భద్రత అనేది మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని,  తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు.  కాగా ఎస్పీ పి. జగదీశ్‌  2017 బ్యాచ్‌కి చెందిన ఐ.పీ.ఎస్‌., అధికారి, గ్రేహౌండ్స్‌ అసాల్ట్‌ కమాండర్‌గా పనిచేస్తూ 2021 జూలైలో పాడేరు అడిషనల్‌ ఎస్పీ(ఎస్‌డీపీవో)గా బదిలీ అయ్యారు. అక్కడ గంజాయి నిషేధంపై యువతలో అవగాహన కల్పించి పరివర్తన తీసుకురావడానికి విశేష కృషి చేశారు. అనంతరం 2022 మే నెలలో చిత్తూరు అడిషనల్‌ ఎస్పీ(పరిపాలన)గా వెళ్లారు, ఈ ఏడాది ఏప్రిల్‌లో అనంతపురంలోని ఏపీఎస్పీ 14వ బెటాలి యన్‌ కమాండెంట్‌గా ఉద్యోగోన్నతిపై బదిలీ అయ్యారు.

[zombify_post]

Report

What do you think?

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి మేలు

పండ్ల అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీశ్రీశ్రీనూకాలమ్మ అమ్మవారు.