యానాం :
అత్యంత రుచికరమైన చేపగా పేరుకెక్కిన పులస మళ్లీ రికార్డు స్థాయి ధర పలికింది. నిన్న సాయంత్రం యానాం పుష్కరఘాట్ వద్ద ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన పులస అతడి పంట పండించింది. రెండు కిలోల బరువున్న ఈ చేపను వేలం వేయగా నాగలక్ష్మి అనే మహిళ రూ. 19 వేలకు కొనుగోలు చేశారు.

ఆ తర్వాత రావులపాలేనికి చెందిన ప్రముఖ నాయకుడి కోసం ఓ వ్యక్తి ఆమె నుంచి రూ. 26 వేలకు కొనుగోలు చేశాడు. ఈ సీజన్‌లో పులసకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. గోదావరికి ఎదురీదే పులస అత్యంత రుచికరంగా ఉంటుందని చెబుతారు. దీనికి తోడు ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ చేపను కొనేందుకు పోటీపడుతుంటారు
[zombify_post]