విశాఖపట్నం: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హామ్‌పూర్ కోర్టులో న్యాయవాదులపై పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ ఈ నెల 8న కోర్టులను బహిష్కరించనున్నట్టు విశాఖ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు తెలిపారు. ఈ మేరకు కార్యదర్శి పైలా శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ సంఘటనను నిరసిస్తూ కోర్టులను బహష్కరించాలని కోరారు. ఈ నెల 4న పోలీసులు కోర్టులో న్యాయవాదులపై కిరాతకంగా లాఠీచార్జి చేసి హింసకు పాల్పడ్డారన్నారు. న్యాయవాదులకు సంఘీభావంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోర్టులను బహిష్కరించి నిరసన తెలుపుతామన్నారు.
[zombify_post]