in ,

సింగరేణి కార్మికుల రిలే దీక్షలు జయప్రదం చేయండి

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కరించాలని రేపు జరిగే రిలే దీక్షలు జయప్రదం చేయాలని సింగరేణి బ్రాంచ్ కార్యదర్శి సుధాకర్ పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కరించాలని, 11 వెజ్ బోర్డులో 23 నెలల ఏరియాస్ ఒకేసారి ఇవ్వాలని, సింగరేణి లాభాల వాటాలో 35% కార్మికులకి ఇవ్వాలని, సింగరేణి ప్రైవేటీకరణ ఆపాలని, క్వార్టర్స్ లో సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేయనున్నట్లు సత్తుపల్లి బ్రాంచ్ కార్యదర్శి సముద్రాల సుధాకర్ తెలిపారు. జే వి ఆర్ ఓ సి లో జరిగిన సమావేశమైన మాట్లాడుతూ రేపు జరిగే రిలే దీక్షను జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యవర్గ సభ్యులు ధారా భీమయ్య, జే వి ఆర్ వో సి ఫుడ్ కార్యదర్శి కార్యదర్శి జి నరసింహారావు, బ్రాంచ్ అడిషనల్ సెక్రటరీ రవి కిషోర్, ఏఐటీయూసీ నాయకులు మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

చేపలు పట్టి నిరసన తెలిపిన జనసేన, టీడీపీ నాయకులు

ఇంటింటికి సంక్షేమం అందించటమే కెసిఆర్ లక్ష్యం