ఇంటింటికి సంక్షేమ పథకం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని జెడ్పిటిసి కూసంపూడి రామారావు అన్నారు. సత్తుపల్లి మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామంలో గొల్ల కురుమలకు వచ్చిన 9 యూనిట్ల గొర్రెలను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించడం లక్ష్యం అని ఇలాంటి పథకాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందటమేనని, ఇలాంటి పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు సాహిత్య, గంగాధర్, సర్పంచ్ కంచర్ల రమాదేవి, ఎంపీటీసీ నాగార్జున పుష్పవతి, బి ఆర్ ఎస్ నాయకులు దేవరపల్లి సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, కొప్పుల రమేష్, తుర్లపాటి నాగేశ్వరరావు, కొత్తపల్లి నరసింహారావు, లబ్ధిదారులు చెన్నారావు, కృష్ణారావు, అంజన్ రావు, కృష్ణ, అప్పారావు, నాగరాజు తదితరులు ఉన్నారు.
[zombify_post]