మండల కేంద్రమైన రెంటచింతల లోని స్థానిక ఆల్ ఫోర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పేదల డెవలప్‌మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న
పేదల డెవలప్‌మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ కె థామస్‌మ్మ , డైరెక్టర్ ఏ రూబీ స్టార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే బాగా చదువుకోవాలన్నారు. విద్యతో ఉన్నతమైన పదవులు పొందేందుకు అవకాశం ఉందన్నారు. ఈ రోజుల్లో విద్య ఉంటేనే విలువలు ఉంటాయని లేకుంటే భవిష్యతే ఉండదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గొంటు సుమంత్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, పూజల వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు , విద్యార్థిని , విద్యార్థులు పాల్గొన్నారు.
[zombify_post]