in ,

సెలవ రోజు కూడా కేసుల పరిష్కారం

వచ్చే శనివారం సెప్టెంబర్ 9న నిర్వహించబోయే లోక్ అదాలత్ సన్నాహక చర్యలో భాగంగా గురువారం సెలవు దినమైనప్పటికీ మూడవ అదనపు మ్యాజిస్ట్రేట్ వి.మాధవి తన కోర్టులో ముందస్తు లోక్ అదాలత్  నిర్వహించారు. రెండవ అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు పూర్తి అదనపు భాద్యతలు నిర్వహిస్తున్న న్యాయమూర్తి లోక్ అదాలత్ నిర్వహించి పలు క్రిమినల్ కేసులను పరిష్కరించారు. ఖానాపూర్ హవెలి పోలీసులు నమోదు చేసిన ఒక కొట్లాట కేసులో ఇరు పక్షాల వారు సమీప బంధువులు కావడంతో ఇరు పక్షాలతో మాట్లాడి రాజి కుదిర్చారు. రాజి మార్గం వల్ల బంధాలు నిలుస్తాయన్నారు. లోక్ అదాలత్ లో 3 వ అదనపు కోర్టు సూపరింటెండెంట్ లిటిల్. పోలీస్ కాన్స్టేబుళ్ళు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కాగా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి మొహమ్మద్ అబ్దుల్ జావీద్ పాషా లోక్ అదాలత్ ను పర్యవేక్షించారు.

[zombify_post]

Report

What do you think?

హుస్నాబాద్ శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు

వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తం ఉండాలి