ఎస్ కోట కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించనున్నట్లు మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి సబ్బవరపు వాణి బుధవారం తెలిపారు. రాజీ ఆమోదయోగ్యమైన క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు, చెల్లని చెక్కులు కేసులు తదితర రాజీ పరిష్కార కేసులను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.
[zombify_post]