in ,

బీటీ రహదారులకు రూ.95.53 కోట్లు

• గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి
• సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.95,53,31,000 నిధులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఎంపీ నామ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నిధులతో గిరిజన గ్రామల్లోని రహదారులకు మహర్దశ పట్టనుందని పేర్కొన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో దాదాపు అన్ని ఏజెన్సీ మండలాల్లో ఈనిధులతో రహదారులు నిర్మించనుండగా, ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని వైరా, కొణిజర్ల, ఏన్కూరు, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, కారేపల్లి, కామేపల్లి, జూలూరుపాడు, అశ్వారావుపేట, దమ్మ పేట, ములకలపల్లి, చండ్రుగొండ, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు, పాల్వంచ, కొత్తగూడెం, పినపాక, ఆళ్లపల్లి, మణుగూరు, అశ్వాపురం, కరకగూడెం, గుండాల, బూర్గంపాడు, బయ్యారం, గార్ల, టేకులపల్లి మండలాల్లోని గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మానానికి ఈ నిధులు వినియోగించనున్నట్లు చెప్పారు. గిరిజన, దళిత గ్రామాలకు కనీస సౌకర్యాల కల్పనకు సీఎం కేసీఆర్ పెద్ద పీట వేసిన నేపథ్యాన సీఎంతో పాటు మంత్రి కేటీఆర్ కూ ఎంపీ నామ కృతజ్ఞతలు తెలిపారు.

రోడ్ల నిర్మాణం ఇలా.. 

జూలూరుపాడు మండలం అనంతారం-నల్లబండ బోడు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4.50 కోట్లు, తవిసగుట్ట తండా మాచినేనిపేట హరిజన తండా వాడకు రూ.కోటి, భోజ్యతండా-రాజ రావుపేట రోడ్డు నిర్మాణానికి రూ.కోటి, కొణిజర్ల మండలం పిడబ్ల్యూ రోడ్డు నుంచి (వయా లాలాపురం) శాం తినగర్ ఎస్టీ కాలనీ వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.4.10కోట్లు మంజూరయ్యాయి. అలాగే, ఏన్కూరు మండలం హిమాంనగర్-భద్రు తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4కోట్లు, కారేప ల్లి మండలం రాయగూడెం-రూక్కీ తండాకు రూ.80లక్షలు, కామేపల్లి మండలం రుక్కీతం డాకు రూ.80లక్షలు, సింగరేణిలో రోడ్డుకు రూ.80లక్షలు, కారేపల్లిలో నిర్మించే రోడ్డుకు రూ.2కోట్లు, తిరుమలాయపాలెం మండలం చంద్రు తండా ఆర్ అండ్ బీ రోడ్డు – జాతీయ రహదారి 365వరకు నిర్మించే రహదారికి రూ.80లక్షలు కేటాయించారు. ఇంకా ఆర్అండ్ బి రోడ్డు – రవిశేట్ల తండా హైదర్ సాయిపేట రోడ్డుకు రూ.2.40కోట్లు నిధులు మంజూరయ్యాయని నామ నాగేశ్వరరావు తెలిపారు. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పాత మారేడుబాక రోడ్డుకు రూ.80లక్షలు, చర్ల మండలం ఆర్అండ్బీ రోడ్డు నుంచి జాతీయ రహదారి 365వరకు నిర్మించే రోడ్డుకు రూ.1.20కోట్లు మంజూరు చేసినట్లు ఎంపీ నాగేశ్వరరావు వెల్లడించారు.

[zombify_post]

Report

What do you think?

చొప్పదండి బిఆర్ఎస్ పార్టీ యూత్ జనరల్ సెక్రటరీగా సువిన్ యాదవ్

ఓటర్ నమోదుకు ప్రోత్సహించాలి