చిన్ని కృష్ణుని జన్మాష్టమి వేడుకలు శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని గురువారం నిర్వహిస్తున్నారు. శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అన్ని కృష్ణ మందిరాలలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. మహిళలు తమ ఇంటి ముంగిళ్లలో చిన్ని కృష్ణుని పాదముద్రికలు తమ గృహంలోకి వచ్చేలా రంగవల్లులను తీర్చిదిద్దుతారు. చిన్నారులకు చిన్ని కృష్ణుడు, గోపికలు, రాధా వేషధారణలు వేసి తల్లిదండ్రులు మురిసిపోతారు. శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లాలోని అన్ని శ్రీకృష్ణ మందిరాలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించేలా ఆలయ కమిటీలు సన్నద్ధమయ్యాయి. ఇంకా జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతో పాటు మున్సిపాలిటీలలో కూడా శ్రీకృష్ణ ఆలయాలు రామాలయాలు వైష్ణవాలయాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు విచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను తిలకించాలని కోరుతున్నారు. అలానే ప్రధాన కోడల్లు, కాలనీలలో ఉట్టి కొట్టే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో నర్తకి టాకీస్ రోడ్ లోనీ మురళీకృష్ణ మందిరంలో తెల్లవారుజాము నుంచి మొదలుకొని రాత్రి వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మందిరం చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి తెలియజేశారు. శ్రీకృష్ణ మందిరంలో గురువారం ఉదయం గోపూజతో ప్రారంభమయ్యే ఉత్సవాలలో 108 కళాశాలతో పంచామృతాభిషేకం, సామూహిక తులశార్చన, సంకీర్తన విభావరి, రాత్రి 7 గంటలకు చిన్నారులకు శ్రీకృష్ణ వేషధారణ పోటీలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శన, రాత్రి 8 గంటలకు గుజరాతి మహిళల చే దాండియా కోలాటం నృత్యం, ఉట్టి కొట్టే వేడుకలు నిర్వహిస్తున్నట్లు కృష్ణమూర్తి వివరించారు. అదేవిధంగా నగరంలోని ప్రకాష్ నగర్ శ్రీకృష్ణ ఆలయంలో, వైష్ణవి ఆలయాలలో, అన్ని గోశాలలలో, యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. రాత్రి వివిధ కూడలలో ఉట్టి కొట్టే సంబురాలు హోరెత్తనున్నాయి.
[zombify_post]