» సాగునీటి ఇబ్బందులు లేకుండా పరిష్కరిస్తాం
» కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
» సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం వరప్రదాయినిలా.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సీతారామ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఒక ఇంజనీరులా రూపకల్పన చేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లిలో లక్ష్మీప్రసన్న ఫంక్షన్ హాల్ లో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు రూపకల్పనలో ఎవరి ప్రమేయం లేదని, గోదావరి జలాలు అందించేందుకే సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. గతంలో డిజైన్ చేసిన దుమ్ముగూడెం ఎత్తిపోతల, ఇందిరాసాగర్ ప్రాజెక్టు లు ఎక్కడ ఉన్నాయో ప్రజలకు తెలుసునన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని, గతంలో జరిగిన ఎన్నికలలో పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వకపోయినా జిల్లా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడంలో ముఖ్యమంత్రి ముందున్నారన్నారు. 50ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా పేద బిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో రూ.లక్షతో అందించే పథకం ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు. గతంలో పింఛన్ రూ.200 ఉండగా సీఎం కేసీఆర్ రూ. వెయ్యి రూ. 2 వేలు చేశారని, దివ్యాంగులకు రూ.4వేలు ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ లో నాలుగు ముఠాలుగా ఏర్పడి ప్రజలల్లో తిరుగుతూ ఐదు గ్యారంటీ హామీలు అంటూ బోగస్ కరపత్రాలను పంపిణీ చేస్తున్నా రని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణాలోని పథకాలను అమలు చేస్తున్నారా అని నిలదీ యాలన్నారు. ఇటీవల కర్ణాటకలో అధికారంలోకి వచ్చినా అక్కడ కూడా పథకాలు అమలులో చేతులు ఎత్తేశారని విమర్శించారు. ఎన్నికల సమయంలో వచ్చి ప్రజలకు హామీ లు ఇచ్చి పారిపోతుంటారని, మనకోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని లబ్ధిదారులే ప్రచారకర్తలుగా ప్రతిపక్షాల దుష్ప్ర చారాన్ని తిప్పికొట్టాలన్నారు. మూడుసార్లు మీ ఆదరాభిమా నాలతో ఎన్నికయ్యాయనని, ఏ సమయంలో అయినా వచ్చి కలిసి సమస్యను పరిష్కరించుకోవచ్చునని, నావద్దకు వచ్చేందుకు ఎటువంటి ఆంక్షలు ఉండవన్నారు. సత్తుపల్లి మునిసిపాలిటీకి రూ.20కోట్లు, పంచాయతీలకు రూ.4కోట్లు సింగరేణి నిధుల నుంచి మంజూరయ్యాయన్నారు. పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాలలు వచ్చాయని, సత్తుపల్లిలో వంద పడకల ఆసుపత్రి ఈ నెలాఖరుకల్లా ప్రారంభోత్సవం చేసేందుకు సిద్ధమవుతుందని, కల్లూరు, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రుల పనులు జరుగుతున్నా యన్నారు. సత్తుపల్లి పట్టణానికి అర్బన్ హెల్త్ సెంటర్ మంజూరవ్వగా విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు ఉమా మహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ వనమా వాసు, జడ్పీటీసీ సభ్యుడు కూసంపూడి రామారావు, ఎంపీపీ దొడ్డా హైమావతి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]