in ,

సత్తుపల్లిలో ఎడతెరిపి లేని వర్షం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సత్తుపల్లి జెవిఆర్ ఓపెన్ కాస్ట్, కిష్టారం ఓపెన్ కాస్ట్ లలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 40000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి లక్ష యాభై వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు ఆటంకం ఏర్పడినట్లు ఓపెన్ కాస్ట్ అధికారులు తెలుపుతున్నారు. బాహుబలి మోటర్ల తో నీళ్ళు బయటకు తోడుతున్నామని సాయంత్రం వర్షం ఆగితే తిరిగి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఓపెన్ కాస్ట్ లోకి నీరు చేరుకోవడంతో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచి పోయాయి అని వర్షం తగ్గుముఖం పట్టిన అనంతరం బొగ్గు ఉత్పత్తి పనులు పునః ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు రెండు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా డివిజన్ పరిధిలోని చెరువులకు వరద నీరు చేరుకుంటుంది. రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెరువులు, వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని పోలీస్ లు సూచనలు చేస్తున్నారు.

[zombify_post]

Report

What do you think?

కానిస్టేబుల్ ఆత్మహత్య

వజ్రాల వేట బల్లకట్టు పడవల యాజమాన్యానికి హెచ్చరిక: ఏసిపి జనార్దన్ నాయుడు