చిత్తూరు : ఎవ్చవరైనా చనిపోతే శరీర భాగాలను దానం చేయాలని కీర్తి చెబుతూ ఉండేదని ఈరోజు ప్రమాదంలో మరణించిన కీర్తి కోరికను తీర్చామని ఆమె తల్లిదండ్రులు కంటతడిపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం రామాపురం హరిజనవాడకు చెందిన సంపత్‌కుమార్ అమ్ములు దంపతుల కుమార్తె కీర్తి (20) ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీకామ్ చదివింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ కాల్ సెంటర్‌లో పని చేస్తున్న ఆమె పెళ్లి నిమిత్తం తన స్నేహితులతో కలిసి బైక్‌పై చెన్నై సమీపంలోని కరడిపుత్తూరుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీని తర్వాత, కీర్తి బ్రెయిన్ డెడ్ అయిందని, కీర్తి అవయవాలను దానం చేయాలని జీ హెచ్ ఆసుపత్రి డీన్, కీర్తి తల్లిదండ్రులను అభ్యర్థించారు. ఆ తర్వాత వారు తమ బాధను మరచిపోయి తమ కుమార్తె శరీర భాగాలను దానం చేశారు. మరణించిన తర్వాత కీర్తికి నివాళులర్పిస్తూ చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో వాక్ ఆఫ్ హానర్ నిర్వహించారు. అవయవాల దానం గురించి కీర్తి తరచూ చెప్పడం పరిపాటి. కుటుంబమంతా వ్యవసాయం చేస్తుందని కీర్తి కుటుంబీకులు తెలిపారు. వారి కుటుంబంలో నలుగురు సభ్యులున్నారు. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి అని, వారిలో మొదటి కుమార్తె కీర్తి అని, ఆమె కుటుంబానికి వెన్నెముక అని చెప్పారు. ఇప్పుడు ఆ ఇంటికి ఆధారమైన పెద్ద కుమార్తె లేదని, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని కుటుంబీకులు రోదించారు. ముఖ్యమంత్రి తమ పరిస్థితిని చూసి ఆదుకోవాలని కోరారు.
[zombify_post]