శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి అలయ పాలకమండలి సభ్యులు ( ప్రత్యేక ఆహ్వనితులు) పవన్ రాయల్ పుట్టిన రోజు వేడుకలు అయన మిత్రులు అత్యంత ఘనంగా పట్టణం లో నిర్వహించారు. సోమవారం పవన్ రాయల్ పుట్టిన రోజు పురస్కరించుకొని మిత్రుల అధ్వర్యంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం సమీపంలోని అంబలి స్వామి ఆశ్రమం వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీ నివాసులు విచ్చేస అన్నదానం నిర్వహించారు. అనంతరం పవన్ రాయల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి మాట్లాడుతు పవన్ రాయల్ ఇటువంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని కోరారు.అన్నదానం కార్యక్రమం అనంతరం అలయనికి అనుబంధం అయిన గోశాలకు రెండు ట్రక్కుల గడ్డ వివరణ చెయ్యడం జరిగింది. తొట్టంబేడు సమీపంలోని అమ్మ ఆశ్రమం వారికి బియ్యం, పప్పులు, వంట నునే వితరణ చెయ్యడం జరిగింది. పాలకమండలి సభ్యుని స్వగృహం వద్ద తన మిత్రులు,అభిమానుల పెద్దఎత్తున కేకు కటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
[zombify_post]