బీడు -బారుతున్న పంట పొలాలను పరిశీలించిన మాజీ శాసన సభ్యులు -ఇంచార్జ్ శ్రీ బగ్గు రమణమూర్తి గారు..
చేతకాని ప్రభుత్వంతో రైతులు అవస్థలు..
తేదీ:(06-09-2023)
ఈ రోజు పోలాకి మండలం,కుసుమపోలవలస పంచాయతీలో గల చల్లబంద గ్రామం నుండి కుసుమపోలవలస మధ్య వంశధార కాలువ ద్వారా సకాలంలో నీరు అందక ఎండిపోతున్న పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించి అక్కడ ఉన్న రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు వింటు మరమ్మతులు లేకుండా ఉన్న వంశధార కాలువలను పర్యవేక్షించడం జరిగింది..
రమణమూర్తి గారు మాట్లాడుతూ….
గడిచిన నాలుగున్నర సంవత్సరాల నుండి నియోజకవర్గంలో రైతులు సకాలంలో వంశధార కాలువలు నీరు అందక చాలా ఇబ్బందులకుగురవుతున్నారనివంశధార కెనల్ సిస్టండెవలప్మెంట్ అయ్యాక గతంలో ఎప్పుడూ కూడాచల్లబంద,కుసుమపోలవలస గ్రామాలే కాకుండా చుట్టుపక్కల 23 గ్రామాలు కూడా ఇటువంటి ఇబ్బందులు నీరు అందక ఎదుర్కోవడం జరగలేదని.. గడిచినా నాలుగున్నర సంవత్సరాల నుండి వంశధార కాలువల పిడికిడి మట్టి కూడా తీయకుండా, ఆధునీకరణ షట్టర్లు మరమ్మతులు లేకుండా రైతుల పట్ల వైస్సార్సీపీ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వలన నీరు సకాలంలో అందించాలనే ఆలోచన లేకుండా రైతుల కళ్ళలో రక్తం కర్చే విధంగా చోద్యం చూస్తున్నారని,నదిలో,చెరుల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ పంట పొలాలకు నీరు ఇవ్వడం లేదు అని రైతులు ఇప్పటికే పూర్తి స్థాయిలో పంటకు పెట్టుబడి పెట్టి వర్షం ఎప్పుడు పడుతుందో అనే స్థితిలో ఆకాశం వైపు చూసే విధంగా ఈ ప్రభుత్వం, అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి వాయిస్తుందని గత తెలుగుదేశం ప్రభుత్వంలో గాని అంతకు ముందున్న ప్రభుత్వములో గాని ఎప్పుడూ రైతులు పట్ల ఇటువంటి ధోరణి చూడలేదని కావున తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం గాని,ప్రజా ప్రతినిధులు గాని రైతులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని స్పందించి కాలువల మరమ్మతులు చేయించి నీరు అందిస్తారని మీడియా ముఖంగా డిమాండ్ చేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకట అప్పలనాయుడు గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర రావు గారు, పార్లమెంట్ రైట్స్ సెక్రటరీ లుకలాపు రాంబాబు గారు, సర్పంచ్ తర్ర లక్ష్మినారాయణ గారు, సీనియర్ నాయకులు, సురపు నారాయణదాసు గారు,పైల రాజేంద్ర గారు, కూన రాంబాబు గారు, మరియి రైతులు పాల్గొన్నారు…
[zombify_post]