విశాఖపట్నం: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా అరిలోవలోని మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాలను మంగళవారం నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సందర్శించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ విద్యార్థులను చూడగానే నాటి టీచర్ గా పని చేసిన అనుభవాలను గుర్తు తెచ్చుకొని పిల్లలకు పాఠాలు చెప్పాలనే కుతూహలంతో టీచర్ గా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. నేటి బాలలే రేపటి పౌరులని మంచి సత్ప్రవర్తనతో విద్యాభోధనలు నేర్చుకోవాలని, ఎల్లప్పుడు తల్లిదండ్రులు గురువులు పట్ల వినయ విధేయతలతో ఉండాలన్నారు. టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చేసిన దేశ సేవను విద్యార్థులకు మేయర్ వివరించారు.
[zombify_post]