మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రహస్య భేటీ అయినట్లు వస్తున్న వార్తలతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది…. హనుమకొండ నయీమ్న గర్ లోని ప్రెసిడెంట్ దాబాలో మాదిగ ఇంటలెక్చువల్ సదస్సులో పాల్గొనేందుకు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హనుమకొండకు వచ్చారు అదే సమయంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సైతం అదే కమ్యూనిటీ కావడంతో ఆ సమావేశంలో పాల్గొనడానికి హోటల్ చేరుకున్నారు.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య మర్యాదపూర్వకంగా దామోదర రాజనర్సింహతో కలిసి అలింగణం చేసుకున్నా ఫోటోలు వైరల్ కావడంతో ఇప్పటికే స్టేషన్ ఘనపూర్ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో కి వెళ్తున్నారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో రేకెత్తిస్తున్నాయి.
[zombify_post]